ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM

...

9pm top news
ప్రధాన వార్తలు @ 9PM

By

Published : Nov 20, 2020, 8:58 PM IST

  • రేపు నాలుగు ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ శంకుస్థాపన
    ప్రపంచం మత్స్య దినోత్సవం సందర్భంగా రేపు 4 ఫిషింగ్​ హార్బర్లు, ఆక్వా హబ్​ నిర్మాణానికి సీఎం జగన్​ శ్రీకారం చుట్టనున్నారు. తొలి దశలో నెల్లూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఫిషింగ్ హర్బర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముందు సీఎం జగన్​ మచిలీపట్నంలో పర్యటించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • '2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం'
    ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం భయపడాల్సిన అవసరం లేదని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రభుత్వం ఎలాంటి భ్రమల్లో లేదని, ఎస్​ఈసీ, చంద్రబాబే భ్రమల్లో ఉన్నారని ఆరోపించారు. ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాష్ట్రంలో కొత్తగా 1,221 కరోనా కేసులు..
    కరోనా ఉద్ధృతి రాష్ట్రంలో క్రమేపీ తగ్గుతోంది. గత 24 గంటల్లో 1,221 మందికి కొవిడ్ సోకగా.. 10 మంది మరణించారు. 1,829 మంది వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. 15,382 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జీహెచ్​ఎంసీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు
    గ్రేటర్‌ హైదరాబాద్‌ మన్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నామినేషన్‌ గడువు ముగిసింది. నామినేషన్ల చివరిరోజైన శుక్రవారం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులతో జోనల్‌ కమిషనర్ల కార్యాలయాలు కిటకిటలాడాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'వారి అప్రమత్తత వల్ల భారీ ఉగ్రకుట్ర భగ్నం'
    జమ్ముకశ్మీర్​లో జరిగిన నగ్రోటా ఎన్​కౌంటర్​, తదనంతర పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కశ్మీర్ సరిహద్దుల్లో, వాస్తవాధీన రేఖ సమీపంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ప్రధాని చర్చించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గోవాకు సోనియా- కొంతకాలం అక్కడే మకాం
    ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా దిల్లీని వీడిన కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. గోవాకు చేరుకున్నారు. కొన్నాళ్ల పాటు గోవాలోనే ఆమె నివసించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఫలితాలు మార్చేందుకు ట్రంప్ విశ్వ ప్రయత్నాలు'
    అమెరికా ఎన్నికల ఫలితాలను మార్చేందుకు అధ్యక్షుడు ట్రంప్.. తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అధికారులపై ఒత్తిడి తేవటం, రాష్ట్ర చట్టసభ్యులకు సమన్లు జారీ చేయటాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఇలాంటి చర్యలతో అమెరికా ఎన్నికలపై విశ్వాసం పోతుందని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • డిసెంబర్​లో ఫైజర్​ వ్యాక్సిన్​!
    తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్​కు ఫైజర్ దరఖాస్తు చేసింది. డిసెంబర్​ నుంచి పరిమిత సంఖ్యలో వ్యాక్సిన్​ వినియోగానికి అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారత్ వేదికగా ఐఎస్ఎల్-7వ సీజన్ ప్రారంభం
    కరోనా వేళలోనూ భారత్​ ఓ మెగాటోర్నీని ఘనంగా ప్రారంభించింది. గోవాలోని బంబోలిమ్​ వేదికగా ఇవాళ్టి నుంచి ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్​ఎల్​) 7వ సీజన్​ ప్రారంభమైంది. తొలిపోరులో కేరళ బ్లాస్టర్స్‌, ఏటీకే మోహన్‌ బగాన్‌ తలపడుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అవార్డురేసులో మూడు భారతీయ చిత్రాలు
    ప్రతిష్ఠాత్మక ఏఏసీటీఏ అవార్డులకు మూడు భారతీయ చిత్రాలు నామినేట్​ అయ్యాయి. బెస్ట్​ ఆసియా ఫిల్మ్​ కేటగిరిలో తప్పడ్​, చపాక్​, శుభ్​మంగళ్​ జ్యాదా సావదాన్​ నిలిచాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details