ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7pm

.

7PM_TOPNEWS
ప్రధాన వార్తలు @ 7pm

By

Published : Oct 9, 2020, 6:59 PM IST

  • 'రెట్టింపు సన్మానం చేస్తా'

రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా తన కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తోందని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. కొద్దిరోజుల క్రితం వరకు తన సోదరుడిని టార్గెట్ చేసిందని... ఇప్పుడు తనను టార్గెట్ చేస్తోందని దుయ్యబట్టారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'తెలంగాణే చేర్చుకోలేదు'

తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఏపీ సంస్థలు రిలీవ్ చేసినా తెలంగాణ సంస్థలు చేర్చుకోలేదని ఉద్యోగుల పిటిషన్ వేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ' జైలుకెళ్లే వారిపై కేసులు ఎందుకని.. ?'

ఓ పత్రిక రాసిన కథనంతో వారి క్రెడిబిలిటీ మరింత దిగజారిందని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. వారిపై పరువునష్టం వేద్దామనుకున్నా... 3 నెలల్లో జైలుకు వెళ్లేవారిపై వేయడం ఎందుకులే అని అనుకున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'మెరుగైన వైద్య సేవలు అందాలి'

రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీతో పాటు అన్ని కొవిడ్​ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందాలని స్పష్టం చేశారు. హోం ఐసోలేషన్​లో ఉన్నవారికి మెడికల్ కిట్లు అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • పాసవాన్​ మృతితో ఎన్నికలపై ప్రభావం!

వర్తమాన రాజకీయాల్లో దళిత దిగ్గజంగా పేరొందిన కేంద్ర మంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్‌ పాసవాన్‌ మరణం.. బిహార్​ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రెండో జాబితా విడుదల

స్విస్ బ్యాంకు ఖాతాదారుల రెండో జాబితాను భారత్​కు స్విట్జర్లాండ్ ప్రభుత్వం అందజేసింది. స్విట్జర్లాండ్‌తో స్వయంచాలక సమాచార మార్పిడి ఒప్పందం (ఏఈఓఐ) ప్రకారం పౌరులు, సంస్థల బ్యాంక్ ఖాతా వివరాలను భారత్ పొందింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • గవర్నర్ కిడ్నాప్​నకు కుట్ర!

అమెరికాలోని మిషిగాన్​ గవర్నర్​ గ్రెట్​చెన్​ విట్మర్​ కిడ్నాప్​ కుట్ర భగ్నం చేశారు ఫెడరల్​ అధికారులు. ఘటనకు సంబంధించి 13 మంది అనుమానితులను అరెస్టు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సెప్టెంబర్​లో డీలా

సెప్టెంబర్​లోనూ వాహనాల విక్రయాలు భారీగా తగ్గాయి. అన్ని విభాగాల్లో కలిపి గత నెల 13,44,866 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయని.. వాహన డీలర్ల సామాఖ్య ఫాడా వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'జట్టు మెరుగ్గానే ఉంది'

కెప్టెన్​ దినేశ్​ కార్తిక్​ నాయకత్వంలో జట్టు ప్రస్తుతం మెరుగ్గానే ఉందని అభిప్రాయపడ్డాడు కోల్​కతా నైట్​రైడర్స్​ బ్యాట్స్​మన్​ ఇయాన్​ మోర్గాన్​. కెప్టెన్​, వైస్​ కెప్టెన్​ సహా సీనియర్​ ఆటగాళ్లందరి సలహాలు ప్రతిఒక్కరూ పాటిస్తారని తెలిపాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఆయన చిత్రాల్లో నటించాలని ఉంది'

ప్రపంచ సుందరి, నటి మానుషి చిల్లర్.. దర్శకుడు రాజమౌళిపై ప్రశంసలు కురిపించింది. ఆయన సినిమాల్లో నటించాలని ఉందంటూ తన కోరికను వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details