ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 5pm - ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 5pm
ప్రధాన వార్తలు @ 5pm

By

Published : Dec 27, 2021, 5:00 PM IST

  • CM Jagan Review On Omicron Variant: సీఎం జగన్ సమీక్ష.. కొత్త ఏడాది వేడుకలపై కీలక నిర్ణయం!
    CM Jagan Review On Omicron Variant: వైద్యారోగ్య శాఖపై.. ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశం నిర్వహించారు. ఒమిక్రాన్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో ప్రధాన ఎజెండాగా చేర్చారు. ఈ నేపథ్యంలో.. కొత్త ఏడాది వేడుకలపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Jagan bail cancellation petition: జగన్ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వు
    Jagan bail cancellation petition: జగన్ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్​ తరఫున న్యాయవాది శ్రీ వెంకటేశ్‌ వాదనలు వినిపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • TDP PROTEST : ఓటీఎస్​ను వ్యతిరేకిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు
    "ఓటీఎస్ వసూళ్లు.. పేదలకు ఉరితాళ్లు" అని నినదిస్తూ.. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద తెలుగుదేశం పార్టీ నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఓటీఎస్ పేరుతో పేదల నుంచి 5వేల కోట్లు దోచుకునేందుకు అధికార పార్టీ మాస్టర్ ప్లాన్ వేసిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • APDCL CMD on electricity employees: విద్యుత్ ఉద్యోగుల తొలగింపుపై.. ఏపీడీసీఎల్ సీఎండీ స్పందన'
    APDCL CMD on electricity employees: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తోన్న ఉద్యోగులను తొలగించబోతున్నారంటూ.. సామాజిక మాద్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఏపీడీసీఎల్ సీఎండీ జనార్దన రెడ్డి స్పందించారు. ఈ విషయానికి సంబంధించి పలు వివరాలను ఆయన వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • పంజాబ్​లో ఆ రెండు పార్టీలతో భాజపా పొత్తు ఖరారు
    BJP captain alliance: పంజాబ్​ శాసనసభ ఎన్నికల్లో అమరీందర్​ సింగ్​, దిండ్సా పార్టీలతో కూటమిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది భాజపా. ఉమ్మడి మేనిఫెస్టోను సిద్ధం చేయనున్నట్లు తెలిపింది. అమిత్​ షా, నడ్డాతో కెప్టెన్​, దిండ్సా భేటీ అనంతరం ఈ ప్రకటన చేసింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఇంటర్​ టాపర్లకు క్యాష్​ ప్రైజ్​, ట్యాబ్​ల పంపిణీ!
    Up government for meritorious students: రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఇంటర్​, మెట్రిక్​ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకంతో పాటు ట్యాబ్​లను అందించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న కార్యక్రమంలో విద్యార్థులకు వీటిని అందజేయనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Brazil floods: బ్రెజిల్​లో భారీ వరదలు-18 మంది మృతి
    Brazil floods: బ్రెజిల్‌ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా దేశంలో 18 మంది చనిపోయారు. మరో 280 మందికిపైగా గాయపడ్డారు. 35 వేల మంది ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • స్టాక్ మార్కెట్లకు లాభాలు- సెన్సెక్స్ 296 పాయింట్లు ప్లస్
    Stock Market: దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 296 పాయింట్లు పెరిగింది. మరో సూచీ నిఫ్టీ 82 పాయింట్లు వృద్ధి చెందింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Ashes 2021: కష్టాల్లో ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్​లో 31/4
    Ashes 2021: యాషెస్ సిరీస్​ను కోల్పోయే ప్రమాదంలో పడింది ఇంగ్లాండ్. ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో ఓడిపోయిన ఇంగ్లీష్ జట్టు మూడో టెస్టులోను ఓటమికి దగ్గరైంది. ఈ మ్యాచ్​లో రెండో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్​లో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది రూట్​సేన. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • రాజమౌళి డ్రీమ్​ప్రాజెక్ట్ 'మహాభారతం'లో చరణ్-ఎన్టీఆర్
    Rajamouli mahabharata: స్టార్ డైరెక్టర్ రాజమౌళి డ్రీమ్​ప్రాజెక్టులో ఇద్దరూ హీరోలు కన్ఫర్మ్​ అయిపోయారు. వారే 'ఆర్ఆర్ఆర్'లో నటించిన చరణ్-ఎన్టీఆర్. ఈ విషయాన్ని 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details