ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM

...

1pm top news
ప్రధాన వార్తలు @1PM

By

Published : Mar 23, 2021, 12:57 PM IST

  • కొత్త ఎస్‌ఈసీ కోసం గవర్నర్‌కు సిఫారసు
    నూతన ఎస్‌ఈసీ కోసం గవర్నర్‌కు మూడు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఈ నెల 31తో ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం ముగియనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలని ఎస్​ఈసీని ఆదేశించలేం: హైకోర్టు
    ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిపేలా ఎస్‌ఈసీని ఆదేశించాలన్న పిటిషన్‌పై.. నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు జరపాల్సిందిగా ఎస్‌ఈసీని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శానిటైజర్​ తాగి చనిపోవడానికి ప్రభుత్వమే కారణం: తెదేపా నేతలు
    సీఎం జగన్​ మద్యం రూపంలో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని.. తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని సవాలు విసిరారు. శానిటైజర్ తాగి చనిపోయిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని మాజీమంత్రి జవహర్ దుయ్యబట్టారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రియుడి సాయంతో భర్తను చంపిన భార్య
    తన భర్తను ప్రియుడి సాయంతో హత్య చేసిందో ఇల్లాలు. ఈ ఘటన కర్నూలు జిల్లా గాజులపల్లెలో జరిగింది. గ్రామానికి చెంది చాకలి నాగరాజు ఈ నెల 18వ తేదీన తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ ప్రాంతాల్లో కొవిడ్ కేసులు 'జీరో'
    అండమాన్​ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్​ ప్రాంతాల్లో కొత్తగా ఒక్క కొవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. దేశవ్యాప్తంగా వైరస్​ వ్యాప్తి పెరుగుతున్నా.. అరుణాచల్​ ప్రదేశ్​లో గత నాలుగు రోజు నుంచి ఒక్క పాజిటివ్​ కేసు నమోదుకాకపోవడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రమాదంలో యువకుడు మృతి- పోలీసులపై దాడి
    ద్విచక్ర వాహనంలో లాఠీ ఇరుక్కోవడం వల్ల ఓ యువకుడు మృతి చెందిన ఘటన కర్ణాటకలో జరిగింది. ఈ ప్రమాదానికి పోలీసులే కారణమని ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు.. రక్షకభటులను చితకబాదారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • హెచ్​1బీ వీసాదారులకు మరింత ఊరట!
    హెచ్​-1బీ వీసాదారుల వేతన సవరణకు సంబంధించిన నిబంధనలపై కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా. కనీస వేతన పరిమితి నిబంధనల అమలును 18 నెలల పాటు వాయిదా వేయాలని ప్రతిపాదించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బ్రౌజింగ్ హిస్టరీ సరే.. బ్రౌజర్‌ కహానీ తెలుసా?
    కంప్యూటర్‌ కనిపెట్టింది ఎవరు అనగానే.. చార్లెస్‌‌ బ్యాబేజ్‌ అని ఠక్కున చెప్పేస్తారు. కానీ, నిత్యం మనకు కావాల్సిన విషయాల్ని తెలుసుకోవడం కోసం వినియోగించే ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ను ఎవరు కనిపెట్టారో తెలుసా? ప్రస్తుతం మార్కెట్లో క్రోమ్‌, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ వంటి బ్రౌజర్లు అనేకం అందుబాటులో ఉన్నాయి.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారత్ చేతిలో ఇంగ్లాండ్​ వైట్​వాషే: వాన్
    ఇంగ్లాండ్​తో జరగనున్న వన్డే సిరీస్​ను టీమ్ఇండియా 3-0 తేడాతో కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు ఇంగ్లీష్ జట్టు మాజీ సారథి మైఖెల్ వాన్. రూట్, ఆర్చర్ లేకపోవడం పెద్ద లోటని వెల్లడించాడు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ట్రైలర్​: మహాభారతానికి మరో పేరుంది.. అదే 'జయ'!
    తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథతో రూపొందిన పాన్​ ఇండియా చిత్రం 'తలైవి'. బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ టైటిల్​ రోల్​ పోషించారు. మంగళవారం కంగన పుట్టినరోజు సందర్భంగా 'తలైవి' ట్రైలర్​ను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details