రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగానే కొనసాగుతోంది. 24 గంటల్లో మొత్తం 90,609 మంది నుంచి నమూనాలు పరీక్షించగా.. 19,981 మందికి ఈ వ్యాధి నిర్ధరణ అయింది. కొత్తగా 118 మంది కరోనాతో మృతి చెందారు. ఉభయగోదవరి జిల్లాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో 17 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 11 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో 14 మంది, విశాఖలో 11, గుంటూరులో పది, అనంతపురం, కృష్ణ జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఎనిమిది మంది చొప్పున, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, కడప జిల్లాలో ఇద్దరు మరణించారు.
రాష్ట్రంలో కొత్తగా 19,981 కరోనా కేసులు, 118 మరణాలు - andhrapradesh covid cases news
17:10 May 22
కొత్తగా 18,836 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో మెుత్తం 1,85,25,758 మంది నమూనాలు సేకరించి పరీక్షించారు. 15,59,165 మందిలో కరోనా నిర్ధరణ అయింది. 2,10,683 యాక్టివ్ కేసులున్నాయి. 13,38,460 మంది కరోనా నుంచి కోలుకోగా.. 10,022 మంది మృతి చెందారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 3,227 మందికి కరోనా నిర్ధరణ అయింది. చిత్తూరు జిల్లాలో 2,581, విశాఖ 2,308, అనంతపురం 1,787, పశ్చిమ గోదావరి జిల్లా 1,537, శ్రీకాకుళం 1,338, ప్రకాశం 1,295, కర్నూలు 1,161, కృష్ణా 1,064, గుంటూరు 1,040 కొత్త కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 912, కడప జిల్లాలో 893, విజయనగరం జిల్లాలో 838 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:
చిన్న వయసులో పెద్ద బాధ్యత.. చిత్తు కాగితాలు ఏరుతూ.. తండ్రి బాగోగులు