రాష్ట్రంలో మరో 182 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి చెందిన 135 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 38 మందికి, విదేశాల నుంచి వచ్చిన మరో 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 971 మందికి కరోనా సోకగా.. విదేశాల నుంచి వచ్చిన 197 మందికి కరోనా బారిన పడ్డారు. కొత్తగా.. తూర్పు గోదావరి., కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మృతి చెందారు. మెుత్తం మృతుల సంఖ్య 80కి చేరింది.
రాష్ట్రంలో కొత్తగా 182 కరోనా కేసులు - ఆంధ్రా కరోనా కేసులు
182 new corona cases registered in ap
12:14 June 11
రాష్ట్రంలో కొత్తగా 182 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రానికి చెందిన 4 వేల 261 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 80కి చేరింది.
Last Updated : Jun 11, 2020, 12:45 PM IST