రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని.. తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రావని ఆయన అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన యనమల..రాష్ట్ర భవిష్యత్ అంధకారం కాకుండా భగవంతుడే కాపాడాలని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రావు. రాష్ట్ర భవిష్యత్ అంధకారం కాకుండా భగవంతుడే కాపాడాలి - యనమల, శాసనమండలి మండలి ప్రతిపక్ష నేత