ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రూపొందించిన అంశాల కంటే... అధిక సాయం చేస్తున్నామన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్... ఏపీ ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా స్ధానంలో ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన గత ప్రభుత్వం... ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా రాజకీయం చేసినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజారవాణాలో ఎలక్ట్రిక్ వాహన వినియోగానికి చర్యలు చేపడుతున్నామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సమావేశంలో చాలా అంశాలపై చర్చించామన్న పీయూష్ గోయల్... చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విధానాలపై పారిశ్రామికవేత్తలు సూచనలు, సలహాలు ఇచ్చారని వివరించారు.