తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్ల అదనపు కోటాను తితిదే విడుదల చేసింది. రేపటి నుంచి ఆగస్టు 31 వరకు సంబంధించిన రోజుకు 3వేల టికెట్ల చొప్పున అదనపు కోటాను తితిదే వెబ్‌సైట్ ద్వారా విడుదల చేశారు. ఈ నెల 20న ఆగస్టు నెల కోటా టికెట్లు విడుదల చేశారు. టికెట్ల కోసం ఎక్కువ మంది ఎదురు చూస్తుండడంతో అదనపు కోటాను విడుదల చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకే టికెట్లను విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ సాంకేతిక సమస్యతో సాయంత్రం మూడు గంటలకు విడుదల చేశారు. వెబ్‌సైట్‌లో టికెట్లు అందుబాటులో ఉంచిన కొంత సమయానికే టికెట్లు అమ్ముడయ్యాయి.
ttd tickets: శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల - తిరుమల దర్శన టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే విడుదల చేసింది. ఉదయం 11 గంటలకే టిక్కెట్లను విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ సాంకేతిక సమస్యతో సాయంత్రం మూడు గంటలకు విడుదల చేశారు.
ttd released special tickets for devotees
Last Updated : Jul 28, 2021, 5:26 PM IST