ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి ద‌ర్శనాల సంఖ్యను ఇప్పట్లో పెంచేది లేదు: తితిదే ఈవో జవహర్ రెడ్డి - chittoor district latest news

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనాల సంఖ్య పెంచబోమని తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. అధికారులతో కలసి తిరుమలలో ఆయన పర్యటించారు.

ttd eo Jawahar Reddy
తిరుమ‌ల‌ శ్రీవారి ద‌ర్శనాల సంఖ్య పెంచబోం

By

Published : Jul 23, 2021, 2:26 PM IST

కరోనా నేపథ్యంలో తిరుమలలో ప్రస్తుతం ఉన్న దర్శనాల సంఖ్యనే కొనసాగిస్తామని తితిదే ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. కొవిడ్ రెండో వేవ్‌ ఇంకా పూర్తిగా తగ్గలేదు.. మరోవైపు ఆగ‌స్టులో మూడో వేవ్ అవ‌కాశ‌ముంద‌ని నిపుణుల హెచ్చరికల తరుణంలో శ్రీవారి ద‌ర్శనాల సంఖ్య పెంచబోమన్నారు. అధికారులతో కలసి తిరుమాడవీధుల వెంట ఉన్న ఉద్యానవనాలతో పాటు పలు ప్రాంతాలను పరిశీలించారు.

పార్కులో భక్తులు సేద తీరేదుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. స్వామివారి అలంకరణ కోసం ఉపయోగించే పూలను తిరుమలలోనే సాగు చేసేందుకుఏర్పాట్లు చేస్తున్నామన్న ఈవో... దాతల సాకారంతో మెక్కల పెంపకం చేపట్టనున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details