తిరుమల కొండపైకి నిషేధిత వస్తువులను తరలిస్తున్న ఫయాజ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడపకు చెందిన ఫయాజ్ ద్విచక్రవాహనంపై తిరుమలకు వస్తుండగా.. అలిపిరి వద్ద ఆపి.. భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. అనుమానంతో బైక్ సీటు విప్పి పరిశీలించగా.. అందులో నాలుగు మద్యం సీసాలు, 30 గుట్కా పొట్లాలను గుర్తించారు. వాహనాన్ని సీజ్ చేయడంతో చేసి.. ఆ వ్యక్తిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తిరుమలకు నిషేధిత వస్తువుల తరలింపు.. తనిఖీల్లో పట్టుబడ్డ వ్యక్తి
తిరుమల కొండపైకి నిషేధిత వస్తువులను తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.
తిరుమలకు నిషేధిత వస్తువుల తరలింపు