ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @7PM

.

TOP NEWS
TOP NEWS

By

Published : Nov 15, 2021, 7:01 PM IST

  • Municipal Elections: రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్‌, నగరపాలిక ఎన్నికలు
    రాష్ట్రంలో మున్సిపల్‌, నగరపాలిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. నెల్లూరు నగరపాలికతో పాటు, 12 పురపాలికల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఎస్​ఈసీ ఓటేసే అవకాశం కల్పించింది. కాగా..మున్సిపల్, నగరపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 17న చేపట్టనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • CM Jagan : 'జూన్ నాటికి రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పూర్తి కావాలి'
    రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణపై సీఎం జగన్‌ సమీక్ష(CM Jagan review) నిర్వహించారు. రోడ్ల మరమ్మతుల పనులను వెంటనే ప్రారంభించాలని సంబంధితశాఖ అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా చేయాలని దిశానిర్దేశం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Somu veerraju : 2024లో అధికారం దిశగా అడుగులేయాలని అమిత్ షా దిశానిర్దేశం: వీర్రాజు
    2024లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata party) అధికారంలోకి వచ్చే విధంగా అడుగులు వేయాలని కేంద్రమంత్రి అమిత్ షా(central minister Amit shah) సూచించినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలను భాజపా లో చేర్చుకుని, ఏపీలో అధికారం దిశగా కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • KALVA: అడ్డదారుల్లో గెలిచేందుకు వైకాపా కుట్రలు.. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకే..
    అనంతపురంలో జరుగుతున్న ఎన్నికల్లో వైకాపా నేతలు అక్రమంగా దొంగ ఓటర్లను వినియోగించి గెలవాలనుకుంటున్నారని తెదేపా నేత కాల్వ అన్నారు. ఇందుకోసం ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కాంగ్రెస్ నేత సల్మాన్​ ఖుర్షీద్ ఇంటికి నిప్పు
    కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటికి నిప్పంటించారు కొందరు దుండగులు. ఉత్తరాఖండ్​ నైనీతాల్ జిల్లాలో ఆయన ఇంటిపై దాడి చేసి.. ఇంటిని ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'క్రిప్టోకరెన్సీని ఆపలేం.. చట్టబద్ధం చేస్తే బెటర్!'
    క్రిప్టోకరెన్సీ అంశంపై పార్టమెంటరీ స్టాండింగ్ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. పారిశ్రామిక వర్గం ప్రతినిధులు, నిపుణులు ఈ భేటీలో పాల్గొన్నారు. క్రిప్టోకరెన్సీని ఆపడం సాధ్యం కాదని, అందుకే దీనికి చట్టబద్ధత కల్పిచడమే మేలని పలువురు అభిప్రాయడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'కరోనా టీకా తీసుకున్న తల్లి పాలలో యాంటీబాడీలు'
    కొవిడ్‌ సోకిన లేదా వ్యాక్సిన్‌ తీసుకున్న తల్లి పాలలో యాంటీబాడీలు (covid antibodies in breastmilk) ఉన్నట్లు అమెరికా నిపుణులు చేసిన అధ్యయనంలో తేలింది. అయితే ఈ యాంటీబాడీలు వైరస్‌ నుంచి చిన్నారులకు రక్షణ కల్పిస్తాయా లేదా అనే విషయం మాత్రం వెల్లడికాలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆ దేశంలో సంతోషానికి కొదవ లేదు.. జనాలే కరవు
    ప్రపంచవ్యాప్తంగా సంతోషకరమైన దేశాల జాబితాలో వరుసగా నాలుగో స్థానంలో నిలిచింది ఫిన్లాండ్(Finland happiest country). కానీ దేశంలో పనిచేసే జనాభా తక్కువగా ఉంది. దీనివల్ల ఆర్థికాభివృద్ధి కుంటుపడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • T20 world cup: బూట్లలో డ్రింక్​ తాగిన ఆసీస్​ క్రికెటర్లు.. ఇదే కారణం
    తొలిసారి టీ20 ప్రపంచకప్​ను (T20 world cup) కైవసం చేసుకొని అంతులేని ఆనందంలో ఉంది ఆస్ట్రేలియా (Australia Cricket News). ఆసీస్ క్రికెటర్లు అయితే ఏకంగా షూస్​లో కూల్​ డ్రింక్​ పోసుకొని తాగడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. వారు అలా చేయడానికి కారణం ఏమిటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'పుష్ప'లో సమంత స్పెషల్ సాంగ్.. సామ్ కెరీర్​లోనే తొలిసారి
    ముద్దుగుమ్మ సమంత(samantha movies) క్రేజీ నిర్ణయం తీసుకుంది. 'పుష్ప'(pushpa release date) సినిమాలోని స్పెషల్ సాంగ్​లో నర్తించేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details