చిత్తూరు జిల్లాలోని 23 కరోనా పాజిటివ్ కేసుల్లో 14 కేసులు తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో నమోదయ్యాయి. ఎక్కువ సంఖ్యలో కొవిడ్ 19 కేసులు నమోదవ్వడం వల్ల ఈ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతంలో కరోనా వ్యాప్తి నివారణకు విస్తృత చర్యలు చేపడుతున్నట్లు తిరుపతి ఆర్డీవో తెలిపారు. తిరుపతి నగరంలో ఆరు, శ్రీకాళహస్తి పట్టణంలో నాలుగు పాజిటివ్ కేసులు ఉన్నాయని....ఈ రెండు ప్రాంతాల్లో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నట్లు ఆర్డీవో చెప్పారు. రెడ్‌జోన్‌లో ఉన్నవారు నిత్యావసరాల కోసం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. రెడ్జోన్లలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆయన ఈటీవీతో భారత్‌తో మాట్లాడారు.
'ఆ రెండు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు' - తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి ఇంటర్య్వూ
చిత్తూరు జిల్లాలో నమోదైన 23 కరోనా పాజిటివ్ కేసుల్లో 14 కేసులు తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలోనే వెలుగు చూడడంపై అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలను రెడ్జోన్లుగా ప్రకటించారు. పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న చర్యలపై తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి