ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతిలో చిన్నారులు అదృశ్యం.. పుత్తూరులో గుర్తింపు - Childrens safely handovered parents at tirupati

Missing childrens found in Tirupati: తిరుపతిలో ముగ్గురు చిన్నారులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. అయితే.. ఆ చిన్నారులు పుత్తూరు రైల్వే పోలీసుల రక్షణలో ఉన్నట్లు తెలియడంతో ఆ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Missing childrens identified in puttur
తిరుపతిలో చిన్నారులు అదృశ్యం.. పుత్తూరులో గుర్తింపు

By

Published : May 24, 2022, 8:07 PM IST

తిరుపతి పరిధిలో అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. వేదాంతపురం పంచాయతీ విజయనగర్ కాలనీకి చెందిన చిన్నారులు.. తేజస్విని(8), శోభారాణి(7), శాంతి(5) ఇంట్లో చెప్పకుండా ఆటో ఎక్కి ఎటో వెళ్లిపోయారు. పిల్లలు లేరని గుర్తించిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినప్పటికీ కనపడలేదు. దీంతో ఎంఆర్ పల్లి పోలీసులకు మంగళవారం ఉదయం ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు గాలింపు చేపట్టగా.. ఆ చిన్నారులు పుత్తూరు రైల్వే పోలీసుల వద్ద సురక్షింతగా ఉన్నట్లు సమాచారం వచ్చింది. దీంతో పిల్లల తల్లిదండ్రులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

పిల్లలను పుత్తూరు సీఐ లక్ష్మీనారాయణ విచారించగా.. పుత్తూరులోని తమ బంధువుల ఇంటికి వచ్చానని శోభారాణి చెప్పింది. తనకు తోడుగా తేజస్విని, శాంతిని తీసుకొచ్చానని తెలిపింది. అనంతరం పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు సీఐ చెప్పారు. పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళన చెందామని.. చిన్నారులను సురక్షితంగా అప్పగించిన పోలీసులకు పిల్లల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదంవడి:

ABOUT THE AUTHOR

...view details