ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మాదక ద్రవ్యాలకు బానిసలై జీవితాలు బలి చేసుకోవద్దు' - మాదక ద్రవ్యాలపై తిరుపతి అర్బన్ ఎస్పీ కామెంట్స్

యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి జీవితాలను బలి చేసుకోవద్దని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు సూచించారు. మత్తు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు.

'మాదక ద్రవ్యాలకు బానిసలై జీవితాలు బలి చేసుకోవద్దు'
'మాదక ద్రవ్యాలకు బానిసలై జీవితాలు బలి చేసుకోవద్దు'

By

Published : Jun 5, 2021, 11:09 AM IST

తిరుపతి నగరంలోని అనుమానాస్పద ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి ఎస్పీ వెంకట అప్పలనాయుడు తనిఖీలు నిర్వహించారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడినట్లు అనుమానిస్తున్న 67 మందిని అదుపులో తీసుకున్నారు. కొంత మందిపై సస్పెక్ట్ షీట్ నమోదు చేశారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక టాస్క్ ఫోర్సు బృందాలు ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాలతో పట్టు బడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ వెంకట అప్పలనాయుడు హెచ్చరించారు. మాదకద్రవ్యాల నివారణలో ఆరోగ్యశాఖ, నగరపాలక సంస్థ భాగస్వాములు కావాలని కోరారు. మాదక ద్రవ్యాల వాడకం, అమ్మకంపై 80999 99977 నెంబర్ కు వాట్సాప్ ద్వారా కానీ 6309913960 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారాన్ని ఇవ్నాలని విజ్ఞప్తి చేశారు. అమాయక యువతను, విద్యార్థులను ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

ABOUT THE AUTHOR

...view details