ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతిలో కంటైన్​మెంట్​ జోన్లుగా 22 వార్డులు - తిరుపతిలో కంటైన్​మెంట్ జోన్లు తాజా వార్తలు

రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరుపతి నగరంలో 22 వార్డులను కంటైన్​మెంట్​ జోన్లుగా ప్రకటిస్తున్నట్లు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా తెలిపారు. తిరుపతిలో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.

tirupathi muncipal commissioner on corona cases
tirupathi muncipal commissioner on corona cases

By

Published : Jun 20, 2020, 3:57 PM IST

లాక్​డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత తిరుపతిలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని.. తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్​ పీఎస్ గిరీషా తెలిపారు. 60 ఏళ్లకు పైబడి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అందరికీ కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. గడచిన రెండు రోజుల్లోనే నగరంలో 30 పాజిటివ్ కేసులు తేలాయని వెల్లడించారు. ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ....తమ కార్యకలాపాలను నిర్వహించాలని కోరిన కమిషనర్.....కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతోన్న నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details