తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల వేలం పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 4 కు వాయిదా వేసింది. జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ డి.రమేష్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు వచ్చింది.
ఆస్తుల వేలం ప్రక్రియను మేలోనే నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని..... తితిదే స్టాండింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ సూరిబాబు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. భూముల వేలంతోపాటు మరికొన్ని అంశాలు కూడా తన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఉన్నాయని... పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.