Teachers Rally on CPS : సీపీఎస్ రద్దు చేయాలంటూ ఏపీయూటీఎఫ్ ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ ర్యాలీ చేపట్టారు. నగరంలోని కృష్ణాపురం ఠాణా నుంచి బస్టాండ్ వరకు 13 జిల్లాల నుంచి తరలివచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, నేతలు పాల్గొన్నారు. నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న రాష్ట్రస్థాయి సదస్సులో సీపీఎస్ రద్దుకై.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర నాటి హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. వెంటనే సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్ రద్దు చేయాలంటూ తిరుపతిలో యూటీఎఫ్ భారీ ర్యాలీ - Teachers Rally on CPS in Tirupathi
ముఖ్యమంత్రి జగన్ ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తిరుపతిలో యూటీఎఫ్ భారీ ర్యాలీ నిర్వహించింది. వెంటనే సీపీఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
Teachers Rally on CPS