Tirumala Brahmotsavams: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. కలియుగ వైకుంఠనాథుడికి జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు సింహ వాహనంపై దేవదేవుడు దర్శనమిస్తున్నారు. అనంత తేజోమూర్తి శ్రీ వేంకటేశ్వరుడు రాక్షసుల పాలిట సింహస్వప్నమై గోచరిస్తారని స్తోత్ర వాంజ్ఞ్మయం కీర్తిస్తోంది. 'మృగాణం చ మృగేంద్రో అహం' తాను మృగాల్లో సింహాన్ని అని భగవద్గీతలో ఆ స్వామి ప్రవచించాడు. శ్రీవిష్ణు సహస్ర నామాల్లో స్వామికి నామాంతరంగా సింహః అని స్తోత్రం ఉంది.
Simha Vahanam: సింహ వాహనంపై శ్రీ వేంకటేశ్వరుడు
Brahmotsavams: కలియుగ దైవం శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు సప్తగిరుల్లో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ రోజుస్వామివారు సింహ వాహనంపై భక్తులకు దర్శనిమిచ్చారు. యోగ నరసింహ స్వామి అవతారంలో పరిమళ భరిత పుష్పాలు, విశేష ఆభరణాలతో.. సర్వాంగ సుందరంగ ముస్తాబైన స్వామివారు తిరు వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.
అందుకే సింహానికి ప్రత్యేకత. ఆ జగన్నాయకుడి అవతారాల్లో నృసింహ అవతారం నాలుగోది. ఈ ఉత్సవాల్లో నాలుగో వాహనం సింహ వాహనం కావడమే విశేషం. యోగ నృసింహుడిగా సింహ వాహనంపై తిరువీధుల్లో దర్శనమిస్తున్న స్వామి.. దుష్టజన శిక్షణకు, శిష్టజన రక్షణకు సంకేతం. యోగ శాస్త్రంలో సింహం వహన శక్తికి, శీఘ్ర గమన శక్తికి ఆదర్శం. సింహ బలమంత భక్తిబలం కలిగి ఉన్నవారిని స్వామి అనుగ్రహిస్తాడని.. ఈ వాహన సేవ అంతరార్థం. ఇప్పుడా స్వామి రూపాన్ని సింహ వాహన సేవను ప్రత్యక్షంగా చూద్దాం.
ఇవీ చదవండి: