సీఎం జగన్ రెండేళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. భాజపాను ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. తిరుపతి ఉపఎన్నిక రాష్ట్ర ప్రజల భవిష్యత్‌తో ముడిపడి ఉందన్న లక్ష్మణ్... అవినీతి, దోపిడీ, పెత్తందారీవ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు: భాజపా నేత లక్ష్మణ్ - BJP leader Laxman comments on Jagan
రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని భాజపా నేత లక్ష్మణ్ ధ్వజమెత్తారు. భాజపాను ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా అక్రమాలను ఎదుర్కోవాలంటే భాజపాతోనే సాధ్యమని లక్ష్మణ్ స్పష్టం చేశారు.
భాజపా నేత లక్ష్మణ్ ప్రచారం
వైకాపా అక్రమాలను ఎదుర్కోవాలంటే భాజపాతోనే సాధ్యమని లక్ష్మణ్ స్పష్టం చేశారు. రేషన్ వాహనాలను ప్రచార వాహనాలుగా వాడుతున్నారన్న లక్ష్మణ్... రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని ధ్వజమెత్తారు. పార్టీ తరపున సీఎం జగన్ లేఖ ఎలా రాస్తారని భాజపా నేత లక్ష్మణ్ ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ రాయాలి కదా..? అని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండీ... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా: శైలజానాథ్
Last Updated : Apr 9, 2021, 7:45 PM IST