శ్రీవారి బ్రహ్మోత్సవాల(srivari-salakatla-brahmotsavalu) ఏర్పాట్లపై తితిదే ఈవో జవహర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. అక్టోబరు 7 నుంచి 15 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో నిర్వహించనున్నారు. ఆలయ కల్యాణమండపంలో వాహనసేవ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
TIRUMALA: అక్టోబరు 7 నుంచి 15 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు: తితిదే
18:00 September 21
srivari salakatla brahmotsavalu
అక్టోబరు 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, అక్టోబరు 7న ధ్వజారోహణం, అక్టోబరు 11న గరుడవాహన సేవ నిర్వహించి.. చివరగా అక్టోబరు 15న చక్రస్నానం, ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు 500 నుంచి వెయ్యి మందికి దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. దీనికితోడు వెనుకబడిన ప్రాంతాల భక్తులకు దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఈవో స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
REVIEW ON MINES: 'పేదలకు 5 వేల క్యూబిక్ మీటర్లలోపు ఉచితంగా ఇసుక'