శ్రీకాళహస్తిలోని అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు తమపై దాడి చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంఛార్జ్ వినుత ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్కు.. ఆయన పార్టీ నేతలు చేసే అరాచకాలు కనపడటం లేదంటూ తిరుపతి ప్రెస్ క్లబ్లో మండిపడ్డారు.
'వైకాపా నేతల అరాచకాలు సీఎంకు కనిపించడం లేదు' - తిరుపతి ప్రెస్ క్లబ్లో సీఎం జగన్పై శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జ్ విమర్శలు
అధికార పార్టీ నేతలు చేసే అరాచకాలు సీఎం జగన్కు కనిపించడం లేదని.. జనసేన శ్రీకాళహస్తి ఇంఛార్జ్ వినుత మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేకు పోలీసులు కొమ్ముకాస్తూ.. తమపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు.
ఆరోపణలు చేస్తున్న జనసేన ఇంఛార్జ్
మహిళల రక్షణే ధ్యేయంగా దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభించినా ఉపయోగం లేకుండా పోతోందని వినుత ఆరోపించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు.. అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు.
ఇదీ చదవండి:'ఇళ్ల స్థలాల పంపిణీ అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి'