ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గంగిరెడ్డి పేరుతో తిరుపతిలో ఓ ముఠా దౌర్జన్యం... వెలుగులోకి దాడి దృశ్యాలు - తిరుపతిలో కొల్లం గంగిరెడ్డి అనుచరుల పేరుతో కొందరు వ్యక్తుల హల్‌చల్‌

some-people-made-a-fuss-in-the-name-of-kollam-gangireddy-followers
తిరుపతిలో దారుణం

By

Published : Sep 5, 2020, 12:47 PM IST

Updated : Sep 5, 2020, 3:32 PM IST

12:44 September 05

తిరుపతిలో కొల్లం గంగిరెడ్డి అనుచరుల పేరుతో కొందరు వ్యక్తుల హల్‌చల్‌

తిరుపతిలో దారుణం

కొల్లం గంగిరెడ్డి అనుచరులమంటూ తిరుపతిలో కొంతమంది వ్యక్తులు కర్రలు, కత్తులతో హల్ చల్ చేశారు. ఈనెల 2న రేణిగుంట రోడ్డులోని బాలాజీ టింబర్ డిపోకు తాళాలు వేసిన సదరు వ్యక్తులు... ఈ స్థలం తమది అంటూ డిపో ఖాళీ చేయాలని యజమాని రాముపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. వారి బెదిరింపులతో భయపడిన ఆయన...అలిపిరి పోలీసులను ఆశ్రయించారు. తన వద్దనున్న సీసీ టీవీ ఫుటేజ్ విజువల్స్ పోలీసులకు సమర్పించాడు. కొల్లం గంగిరెడ్డి ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడు.   

అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడి కేసులో నిందితుడు గంగిరెడ్డి.. ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో అరెస్టై ఇటీవల విడుదలయ్యారు. అతని అనుచరులంటూ దౌర్జన్యాలకు పాల్పడటంతో వాళ్ళు ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి:సెప్టిక్ ట్యాంక్ వాహనం కోసం గొడవ... యువకుడు హత్య

Last Updated : Sep 5, 2020, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details