ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sithamma Trust Lands: 'సీతమ్మ ట్రస్ట్​ భూముల జోలికొస్తే ఊరుకోం' - ఆర్యవైశ్య సంఘం

తిరుపతి నగర శివార్లలో ఉన్న సీతమ్మ ట్రస్ట్​ భూములను(Sithamma Trust Lands) స్వాధీనం చేసుకునేందుకు తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు చేసిన ప్రయత్నాల్ని ట్రస్ట్​ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నేతలు అడ్డుకున్నారు. ఆక్రమణలు తొలగించి భూములను ట్రస్ట్​ సభ్యులకు అప్పగించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా అధికారులు వాటిని అమలు చేయడం లేదని ట్రస్ట్​ సభ్యులు ఆరోపించారు.

Sithamma Trust Lands
Sithamma Trust Lands

By

Published : Sep 26, 2021, 7:33 PM IST

తిరుపతి నగర శివార్లలో ఉన్న సీతమ్మ ట్రస్ట్​ భూములను(Sithamma Trust Lands) స్వాధీనం చేసుకునేందుకు తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ప్రయత్నాలు చేశారు. అయితే వారి ప్రయత్నాల్ని.. ట్రస్ట్​ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నేతలు అడ్డుకున్నారు. నగరపాలక సంస్ధ భూముల చుట్టూ ఉన్న ప్రహరీలను కూల్చడంపై నిరసనకు దిగారు. ఆక్రమణలు తొలగించి భూములను ట్రస్ట్​ సభ్యులకు అప్పగించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా అధికారులు వాటిని అమలు చేయడం లేదని ట్రస్ట్​ సభ్యులు ఆరోపించారు.

కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా నగరపాలక సంస్థ.. సీతమ్మ ట్రస్ట్ భూములను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తే పరిస్ధితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సీతమ్మ ట్రస్ట్ భూములను కాపాడుకునేందు ఎంతకైనా వెనకాడమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:tirumala sarwadarshan tickets: సర్వదర్శన టికెట్ల కోసం భక్తుల పాట్లు.. ఇంటర్‌నెట్‌ కేంద్రాల నిర్వాహకులు చేతివాటం

ABOUT THE AUTHOR

...view details