తిరుపతిలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 7 గంటల తర్వాత దుకాణాలు మూసివేయాలని.. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. నగరపాలక సంస్థ ఎన్నికల తర్వాత తొలిసారి మేయర్ శిరీష అధ్యక్షతన కౌన్సిల్ సమావేశమైంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా తదితరులు సమావేశానికి హాజరయ్యారు. నాలుగు ప్రధాన అంశాలే ఎజెండాగా కౌన్సిల్ సమావేశం జరిగింది.
సెకండ్ వేవ్: తిరుపతిలో వ్యాపార సముదాయాలపై ఆంక్షలు - Corona Second Wave news
తిరుపతిలో రాత్రి 7 గంటల తర్వాత దుకాణాలు మూసివేయాలని.. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. నగరపాలక సంస్థ బాధ్యత తీసుకుని కరోనాను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కౌన్సిల్ అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి.. నగరపాలక సంస్థ బాధ్యత తీసుకుని కరోనాను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేసులు పెరిగిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో రాత్రి 7 గంటల తర్వాత నగరంలో దుకాణాలు మూసివేయాలని తీర్మానంతో పాటు హనుమ జన్మస్థలంగా అంజనాద్రిని ప్రకటించిన తితిదేకి అభినందన తీర్మానాన్ని ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం రెండు తీర్మానాలపై కౌన్సిల్.. సభ్యుల ఆమోదాన్ని కోరగా.. రెండు తీర్మానాలను నగరపాలక సంస్థ ఏకగ్రీవంగా ఆమోందిచినట్లు కమిషనర్ గిరీషా ప్రకటించారు.
ఇదీ చదవండీ... కరోనా: మంత్రుల కమిటీ సమావేశంలో కీలకాంశాలపై చర్చ