కోవాగ్జిన్ రెండో డోస్ వేయించుకునే వారి కోసం తిరుపతి నగరంలో అన్ని ఏర్పాట్లు చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా తెలిపారు. బైరాగిపట్టెడ ఎంజీఎం పాఠశాల, ఇందిరా మైదానం, నెహ్రూ మున్సిపల్ మైదానాలలో మూడు కేంద్రాలలో రేపు వ్యాక్సినేషన్ చేయనున్నారు. ప్రజలంతా ఏఎన్ఎంలు, వాలంటీర్లు ఇచ్చే టోకెన్లు తీసుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. నగరంలో ప్రస్తుతానికి మధ్యాహ్నం 12 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా జూన్ 5న 10 వేల చెట్లు.. నగరంలో నాటేందుకు ప్రణాళికలు రచించామన్నారు. గరుడవారధి మొదటి దశ పనులు రెండు, మూడు నెలల్లో పూర్తవుతాయని ఆయన తెలిపారు.
రేపు తిరుపతిలో రెండో డోస్ కోవాగ్జిన్ వ్యాక్సినేషన్ - రేపు తిరుపతిలో రెండో డోస్ వ్యాక్సినేషన్
తిరుపతిలో రేపు కోవాగ్జిన్ రెండో డోస్ వ్యాక్సిన్స్ వేయనున్నారు. ప్రజలంతా ఏఎన్ఎంలు, వాలంటీర్లు ఇచ్చే టోకెన్లు తీసుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా కోరారు.
రేపు తిరుపతిలో రెండో డోస్ కోవాగ్జిన్ వ్యాక్సినేషన్