సినీ హీరో సాయిధరమ్ తేజ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నెల 12న విడుదల కానున్న తన కొత్త సినిమా చిత్రలహరి విజయం సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు. తన మామయ్య పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనీ.. రాజకీయాల్లో రాణించాలని ప్రార్థించినట్లు చెప్పారు. పవన్ మీద వస్తున్న విమర్శలపై స్పందించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అవన్నీ సాధారణమనీ.. వాటి గురించి పట్టించుకోనక్కర్లేదని అన్నారు.
నా సినిమా ఆడాలి... మామయ్య గెలవాలి! - హీరో
తిరుమల శ్రీవారిని సినీ నటుడు సాయిధరమ్ తేజ్ దర్శించుకున్నారు. తన సినిమా విజయవంతం కావాలనీ.. మామయ్య పవన్ కల్యాణ్ రాజకీయాల్లో రాణింలని ప్రార్ధించాననీ చెప్పారు.
తిరుమల సన్నిధిలో సాయిధరమ్ తేజ్