తిరుపతి ప్రగతి నగర్ లో చిరుత పులుల భయాందోళనకు గురి చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. కపిలతీర్థం పరిసర ప్రాంతాల్లో ఇటీవల రాత్రి సమయాల్లో తరచూ చిరుతలు సంచరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ఫ్యూ నిబంధనల కారణంగా ఆలయ దర్శన వేళల సమయాన్ని కుదించటంతో.. శేషాచలం అటవీ ప్రాంతాల నుంచి వన్యప్రాణాలు వచ్చి కాలనీల్లో సంచరిస్తున్నాయని చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని భద్రతా ఏర్పాట్లను చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తిరుపతిలో చిరుత పులుల సంచారం.. ఆందోళనలో ప్రజలు - latest news in chittor district
చిరుత పులుల బారి నుంచి తమను కాపాడాలని కోరుతూ తిరుపతి ప్రగతి నగర్ వాసులు విజ్ఞప్తి చేశారు. కపిలతీర్థం పరిసర ప్రాంతాల్లో ఇటీవల రాత్రిపూట సమయాల్లో తరచూ చిరుతలు సంచరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
చిరుత పులుల సంచారం