తిరుపతి శివారు.. శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం అధికారులు కూంబింగ్ నిర్వహించారు. కరకంబాడి సమీపంలోని కుక్కల గుండం వద్ద అక్రమంగా ఎర్రచందనాన్ని రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు స్మగర్లను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని 9 ఎర్రచందనం దుంగలు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దొడ్లమిట్ట గ్రామానికి చెందిన వేముల నారాయణ, వేముల మణి, కాకోలు సుబ్రహ్మణ్యం, కాటూరి బత్తయ్యలుగా గుర్తించారు.
Red Sandal: ఎర్రచందనం అక్రమ రవాణా.. నలుగురు అరెస్టు - చిత్తూరులో ఎర్రచందనం అక్రమ రవాణా
ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 9 ఎర్రచందనం దుంగలు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
ఎర్రచందనం అక్రమ రవాణా