వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి... తనపై వ్యంగ్యంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని రఘురామకృష్ణరాజు... సీఎం జగన్ ఔదార్యంతో ఎంపీ టికెట్ పొందారని వ్యాఖ్యానించారు. వెయ్యికోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేసి అరెస్ట్ ఎవరయ్యారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నిర్దేశకత్వంలో పనిచేస్తున్న రఘురామకృష్ణరాజును బ్లాక్ షీప్ అంటూ ఎద్దేవా చేసిన పెద్దిరెడ్డి... పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరై ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పాలని ఎంపీని ఆహ్వానించారు.
రఘురామకృష్ణరాజు వార్డుమెంబర్‌గా కూడా గెలవలేడు: పెద్దిరెడ్డి - Peddireddy Ramachandra Reddy Latest News
వార్డుమెంబర్‌గా కూడా గెలవలేని రఘురామకృష్ణరాజును... సీఎం జగన్ ఎంపీ చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. తనపై ఎంపీ రఘురామ చేసిన వ్యాఖ్యల పట్ల ఘాటుగా స్పందించారు. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరై ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పాలని ఎంపీని ఆహ్వానించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి