రాఘవేంద్రరావు రాజీనామా- వయోభారమని వివరణ - resignation
వయోభారంతో ఎస్వీబీసీ అధ్యక్ష పదవికి రాఘవేంద్రరావు రాజీనామా చేశారు.
ఎస్వీబీసీకు రాఘవేంద్రరావు రాజీనామా
ఎస్‌వీబీసీ అధ్యక్ష పదవికి కె.రాఘవేంద్రరావు రాజీనామా చేశారు. వయోభారం వల్ల ఆ పదవిలో కొనసాగలేనంటూ లేఖలో పేర్కొన్నరు. తితిదే ఛైర్మన్, ఈవోలకు రాజీనామా లేఖను పంపించారు. ఇన్ని రోజులు తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 2015 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. 2018 ఏప్రిల్లో ఎస్వీబీసీ ఛైర్మన్గా రాఘవేంద్రరావును నియమించారు.