ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PROTEST: బురద నీటితో స్నానం.. అధికారుల తీరుపై సర్పంచ్ గరం గరం - పుదిపట్ల పంచాయతీ సర్పంచ్

ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఓ సర్పంచ్ వినూత్న నిరసన చేపట్టారు. బురద నీటిలో కూర్చొని నిరసనలు తెలుపుతూ అదే నీటితో స్నానం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలతో కలసి భారీ ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

PROTEST
PROTEST

By

Published : Aug 28, 2021, 8:49 PM IST

బురద నీటితో స్నానం.. అధికారుల తీరుపై సర్పంచ్ ఆగ్రహం

చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల పంచాయతీ సర్పంచ్ బడి సుధీ యాదవ్ వినూత్న నిరసన చేపట్టారు. బురద నీటితో స్నానం చేస్తూ ఆర్అండ్ బీ అధికారులు, బ్రిడ్జి కాంట్రాక్టర్లపై మండిపడ్డారు. 2018లో ప్రారంభించిన బ్రిడ్జి పనులను ఏళ్లు గడుస్తున్నా పూర్తి చేయని కారణంగా.. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని నిరసన తెలిపారు. చంద్రగిరి, మదనపల్లి నుంచి తిరుపతికి వచ్చే వారంతా జూపార్కు రోడ్డులో ప్రయాణిస్తున్నారని.. అక్కడ సైతం 4 లైన్ల రోడ్డు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

తిరుపతికి వెళ్లేందుకు సరైన మార్గం లేక ప్రజలు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే మోకాళ్ల లోతు గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. 20 రోజుల క్రితం జూపార్కు రోడ్డులో ప్రయాణించి ప్రమాదంలో ఇద్దరు యువ డాక్టర్లు మృతి చెందారని గుర్తు చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలందరి సహకారంతో హైకోర్టులో కేసు వేస్తామని, భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details