తిరుమల శ్రీవారి భక్తులకు తితిదే శుభవార్త చెప్పింది. శ్రీవారి మెట్టు మార్గంలో నేటి నుంచి భక్తులకు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. ఐదు నెలల తర్వాత శ్రీవారిమెట్టు నడకమార్గంలో భక్తులకు అనుమతినిచ్చారు. గతేడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం దెబ్బతింది. అప్పట్నుంచి ఆ మార్గంలో భక్తులను అనుమతించలేదు. దీంతో మరమ్మతులు పూర్తి చేసి మెట్టు మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. నేటి ఉదయం 8.30 గంటల నుంచి భక్తులను అనుమతించనున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు.
నేటి నుంటి తిరుమల శ్రీవారి మెట్టుమార్గంలో భక్తులకు అనుమతి - తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో రేపట్నుంచి భక్తులకు అనుమతి
నేటి నుంచి తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతిస్తున్నట్లు తితిదే స్పష్టం చేసింది. ఐదు నెలల తర్వాత ఇవాళ ఉదయం 8.30 గంటల నుంచి భక్తలను అనుమతించన్నట్లు తితిదే వెల్లడించింది.
రేపట్నుంచి భక్తులకు అనుమతి
Last Updated : May 5, 2022, 3:59 AM IST