ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రెండేళ్ల తర్వాత.. శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి: తితిదే ఛైర్మన్ - శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి వార్తలు

శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా స్వామివారి సేవలన్నీ ఏకాంతంగానే నిర్వహించామని.. వైరస్ తగ్గుముఖం పట్టడంతో ఇవాళ వేకువజాము నుంచి ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు భక్తులకు అవకాశం కల్పించామన్నారు.

శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి
శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి

By

Published : Apr 1, 2022, 4:12 PM IST

రెండేళ్ల తర్వాత తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా స్వామివారి సేవలన్నీ ఏకాంతంగానే నిర్వహించామన్నారు. కొవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఇవాళ వేకువజాము నుంచి భక్తులను ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించామన్నారు. సుప్రభాతం మొదలుకొని అన్ని రకాల ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లను జారీ చేసినట్లు ఛైర్మన్ వైవీ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details