విభజన తర్వాత కష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే సమర్థవంతమైన, అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్రావు వ్యాఖ్యానించారు. కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయన... తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. తన ఎన్నికల సర్వే ఫలితాలను చివరి దశ ఎన్నికల పోలింగ్ తర్వాత తెలియజేస్తానన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమపాలల్లో అందించే వారిని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
రాష్ట్రాభివృద్ధికి అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలి: లగడపాటి - lagadapati
రాజధాని లేకపోయినా.. నిధులను పోగేసుకొని నిర్మిస్తున్న నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అందరూ అబ్బురపడే విధంగా నిర్మించాలని మాజీ ఎంపీ లగడపాటి వ్యాఖ్యానించారు. దూరదృష్టి గల నాయకుణ్ణి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు.
మాజీ ఎంపీ లగడపాటి