కొవిడ్ బారినపడి తిరుపతిలో ఆయువు వదిలేసిన అనాథల అంతిమ సంస్కారాలు చేసేందుకు తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ముందుకొచ్చారు. 21 అనాథ మృతదేహాలకు బుధవారం అంతిమ సంస్కారాలు జరిపారు. రుయా మార్చురీలో కొన్ని రోజులుగా ఉన్న మృతదేహాలను బయటికి తీయించి, రుయా మహాప్రస్థానం, ముస్లిం జేఏసీ వాహనాల్లో తరలించి వాటిని దహనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... గతేడాది మిత్రులు, సహచరులు ముస్లిం జేఏసీగా ఏర్పడి ఇప్పటి వరకు 501 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, రుయా హెచ్‌డీఎస్ వర్కింగ్ ఛైర్మన్ బండ్ల చంద్రశేఖర్ రాయల్, ముస్లిం జేఏసీ ప్రతినిధి ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.
21 అనాథ మృతదేహాలకు ఎమ్మెల్యే దహన సంస్కారాలు - 21 అనాథ మృతదేహాలకు ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి దహన సంస్కరాలు
కొవిడ్ బారినపడి తిరుపతిలో ఆయువు వదిలేసిన అనాథల అంతిమ సంస్కారాలు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ముందుకొచ్చారు. 21 అనాథ మృతదేహాలకు బుధవారం అంతిమ సంస్కారాలు జరిపారు.
మృతదేహలకు పూలమాలలు వేస్తున్న ఎమ్మెల్యే