కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి మాతృమూర్తి వకుళామాత ఆలయాన్ని నిర్మించడం ఆనందంగా ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రెండు మూడు నెలల్లో ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. పేరూరు బండపై నిర్మిస్తున్న వకుళామాత ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు కొనసాగుతున్నాయని.... పనులు త్వరగా పూర్తి చేయటానికి శిల్పులు, స్థపతులు శ్రమిస్తున్నారని మంత్రి తెలిపారు. వకుళామాత ఆలయం గర్భ గుడి ... ఆనంద నిలయాన్ని పోలి ఉంటుందని మంత్రి అన్నారు. ఈ ఆలయాన్ని నిర్మించే అవకాశం రావడం మహద్బాగ్యంగా భావిస్తున్నామన్నారు.
వకుళామాత ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి
చిత్తూరు జిల్లా పేరూరు బండపై నిర్మిస్తున్న వకుళామాత ఆలయ నిర్మాణ పనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. పనులు త్వరతిగతిన పూర్తి చేస్తామన్నారు.
వకుళామాత ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి
ఇదీ చదవండి: