ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సినిమా టికెట్ల ధరల వివాదం.. జగన్, చిరంజీవి భేటీ వ్యక్తిగతం: మంచు విష్ణు - maa president Manchu Vishnu on movie tickets issue

Manchu Vishnu
Manchu Vishnu

By

Published : Feb 7, 2022, 1:27 PM IST

Updated : Feb 7, 2022, 2:07 PM IST

13:23 February 07

రెండు ప్రభుత్వాలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం: మంచు విష్ణు

సినిమా టికెట్ల ధరల వివాదం.. తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందుకెళ్తాం:మంచు విష్ణు

Manchu Vishnu on movie tickets issue : సినిమా టికెట్ల ధరలు తెలంగాణలో పెంచారు... ఏపీలో తగ్గించారని 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. ఈ విషయంపై సినీ పరిశ్రమ ఏకతాటిపైకి రావాలన్నారు. సినిమా టికెట్లపై తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంటుంది.. ఆ నిర్ణయం మేరకు ముందుకెళ్తామన్నారు. అంతేకానీ వ్యక్తిగతంగా తన నిర్ణయంతో పనిలేదన్నారు. ఎవరూ తన అభిప్రాయం అడగట్లేదన్నారు. టికెట్లపై వైఎస్‌ హయాంలోనే జీవో వచ్చింది... ముందు దానిపైనా చర్చ జరగాలని తెలిపారు. ఈ మేరకు తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు.

సినిమా టికెట్ల ధరలపై ఒకరిద్దరు మాట్లాడి వివాదం చేయడం సరికాదు. రెండు ప్రభుత్వాలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం. నేను విడిగా మాట్లాడి సమస్య పక్కదారి పట్టించలేను. ఎందుకంటే రెండు ప్రభుత్వాలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. టికెట్ల ధరపై ఏర్పాటైన సబ్ కమిటీని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కలిసింది. చిరంజీవి, జగన్ కలయిక వ్యక్తిగత సమావేశం మాత్రమే.. దాన్ని అసోసియేషన్ భేటీగా భావించకూడదు. -మంచు విష్ణు , 'మా' అధ్యక్షుడు

Megastar Chiranjeevi on movie tickets issue: ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఆహ్వానం మేరకు విజయవాడ వచ్చిన ఆయన.. గంటన్నరపాటు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ పెద్దగా కాకుండా పరిశ్రమ బిడ్డగా వచ్చానని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ అంశాలపై మరోమారు సమావేశం జరిగే అవకాశముందని చిరంజీవి వెల్లడించారు.

ఇదీ చదవండి

Chiranjeevi on Movie Tickets: సినిమా టికెట్ల వివాదం త్వరలోనే కొలిక్కి వస్తుందని భావిస్తున్నా: చిరంజీవి

Last Updated : Feb 7, 2022, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details