ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతిలో వైకాపా రక్తపాతం సృష్టిస్తోంది: లోకేశ్ - టీడీపీ కార్యకర్త మర్డర్​పై లోకేశ్ ట్వీట్

ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. వైకాపా 18 నెలల పాలనలో తిరుపతి చెందిన అయిదుగురు యువకుల్ని అత్యంత కిరాతకంగా హత్యచేశారని ధ్వజమెత్తారు. తెదేపా కార్యకర్త భరత్ యాదవ్ హత్యను లోకేశ్ ఖండించారు.

Lokesh tweet
Lokesh tweet

By

Published : Dec 2, 2020, 4:20 AM IST

Updated : Dec 2, 2020, 6:22 AM IST

ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో వైకాపా రక్తపాతం సృష్టిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న వైకాపా నేతల చేతికి అధికారం ఇస్తే ఎంత ప్రమాదమో తిరుపతిలో జరుగుతున్న వరుస ఘటనలు నిదర్శనమన్నారు.

18 నెలల పాలనలో తిరుపతిలోనే అయిదుగురు యువకుల్ని వైకాపా నేతలు అత్యంత కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు. హత్యా రాజకీయాలకు కాలం చెల్లిందని జగన్ గుర్తించాలని లోకేశ్ హితవు పలికారు. తెదేపా కార్యకర్త భరత్ యాదవ్ హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. కుటుంబసభ్యులకు లోకేశ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి :గిన్నిస్ రికార్డ్ టైటిల్ సాధించిన ఎస్ఆర్ఎం విద్యార్థిని

Last Updated : Dec 2, 2020, 6:22 AM IST

ABOUT THE AUTHOR

...view details