తిరుపతిలో సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. తిరుపతి సత్యనారాయణపురం క్రాస్ వద్ద ఎస్‌ఈబీ తనిఖీలు నిర్వహిస్తుండగా... కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న 267 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఆటోలో తీసుకొస్తుండగా మద్యాన్ని అధికారులు గుర్తించారు. ఆటో సీజ్, కేసు నమోదు చేశారు.
తిరుపతిలో సరిహద్దు రాష్ట్రాల అక్రమ మద్యం హల్ చల్ - తిరుపతిలో అక్రమ మద్యం
తిరుపతిలో సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి సత్యనారాయణపురం క్రాస్ వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. తిరుపతి రూరల్ మండలం కొత్తూరు క్రాస్ వద్ద అధికారులు అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతిలో సరిహద్దు రాష్ట్రాల అక్రమ మద్యం హల్ చల్
తిరుపతి రూరల్ మండలం కొత్తూరు క్రాస్ వద్ద అధికారులు అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు నుంచి తీసుకొచ్చిన మద్యంగా అధికారులు గుర్తించారు. ఇద్దర్ని అరెస్టు చేశారు. అధికారులు వాహనం సీజ్ చేసి.. కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: సరిపడా అంబులెన్సులు.. అయినా సకాలంలో అందని సేవలు!