Municipal meeting: ‘కొందరికి పింఛను రద్దయింది.. మరికొందరికి ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదు. ఇలాంటి సమస్యలతో రోజూ ప్రజలు ఉదయమే ఇళ్ల ముందుకొచ్చి కూర్చుంటున్నారు. వారికేం సమాధానం చెప్పాలి’ అని కర్నూలు జిల్లా ఆదోని పురపాలక సంఘం సమావేశంలో అధికార పార్టీ సభ్యులు పాలకవర్గాన్ని ప్రశ్నించారు. ‘మా వార్డులో 300 మందికి పైగా జగనన్న ఇళ్ల పట్టాలకు దరఖాస్తు చేసుకుంటే.. 100 వరకే వచ్చాయి. త్వరలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో భాగంగా ఎమ్మెల్యే పర్యటించనున్నారు. అప్పుడు జనం ప్రశ్నిస్తే పరిస్థితి ఏంటని వైకాపా సభ్యుడు చలపతి ప్రశ్నించారు. ‘తమ వార్డులో బురద దారిలో వెళ్లాల్సి వస్తోంది’ అని 23వ వార్డు సభ్యురాలు భారతి (వైకాపా) భావోద్వేగంతో సభ్యుల ముందుకెళ్లి వేడుకున్నారు.
Municipal: 'వార్డుల్లో అభివృద్ధి లేదు.. ప్రజలకేం సమాధానం చెప్పాలి?' - కుప్పం మున్సిపల్ సమావేశానికి నేత గైర్హాజరు
Municipal meeting: ‘వార్డుల్లో అభివృద్ధి జరగలేదు. ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలి’ అని పురపాలక సమావేశాల్లో అధికార పార్టీ సభ్యులే పాలకవర్గాలను ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. కుప్పం పురపాలక కార్యాలయంలో ఛైర్మన్ సుధీర్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన పురపాలక సాధారణ సమావేశానికి సగానిపైగా సభ్యులు హాజరు కాలేదు.
* కుప్పం పురపాలక కార్యాలయంలో ఛైర్మన్ సుధీర్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన పురపాలక సాధారణ సమావేశానికి సగానిపైగా సభ్యులు హాజరు కాలేదు. వచ్చిన వాళ్లూ అభివృద్ధి జరగలేదని అసహనం వ్యక్తం చేయడంతో సమావేశం నామమాత్రంగా సాగింది. పురపాలిక ఎన్నికలు పూర్తైన నాటి నుంచీ ప్రతి సమావేశంలో అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు పెడుతున్నా.. ప్రయోజనం కనిపించడం లేదని అందుకే అధికార పార్టీ కౌన్సిలర్లు సమావేశానికి దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. 25 వార్డుల్లో 19 మంది వైకాపా సభ్యులు గెలవగా సమావేశానికి కేవలం ఛైర్మన్, ఇద్దరు వైస్ ఛైర్మన్లు, ముగ్గురు వైకాపా కౌన్సిలర్లు, నలుగురు తెదేపా కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. మిలిగిన సభ్యుల్లో భార్యలకు బదులు భర్తలు, తల్లికి బదులు కుమారులు వచ్చారు. కోరం ఉండటంతో ఛైర్మన్ సమావేశాన్ని కొనసాగించారు.
ఇవీ చదవండి: