గరుడ వారధిని కపిలతీర్థం నుంచి అలిపిరికి పొడిగించాలన్న తితిదే నిర్ణయాన్ని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి కిరణ్ రాయల్ తప్పుబట్టారు. ఎన్నో పురాతన వృక్షాలు, నిలువెత్తు చెట్లతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ పచ్చదనానికి నిలయంగా ఉన్న అలిపిరి-కపిలతీర్థం రహదారిలో ఫ్లైఓవర్ రావాలని తిరుపతి వాసులు ఎవరూ కోరుకోవటం లేదన్నారు. అటవీ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టకూడదంటూ చట్టాలున్నా... తితిదే అధికారులు అర్థంపర్థం లేని నిర్ణయాలు తీసుకోవటం సరికాదన్నారు. కేవలం శ్రీవారి నిధులను స్వాహా చేసేందుకు ఈ వారధి పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నామన్నారు. ముందు తిరుచానూరు మార్కెట్ యార్డు వరకూ ఉన్న మొదటి దశ పనులను పూర్తి చేసేందుకు నగరపాలక సంస్థకు తితిదే సహకరించాలని జనసేన తరపున కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.
'శ్రీవారి నిధులను స్వాహా చేసేందుకే వారధి పొడిగింపు నిర్ణయం' - AP Latest News
శేషాచలం అటవీ ప్రాంతానికి ఆలవాలమైన అలిపిరి గరుడ సర్కిల్-కపిలతీర్థం రహదారిలో వారధిని నిర్మించాలనుకోవటం అర్థం లేని చర్య అని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి కిరణ్ రాయల్ వ్యాఖ్యానించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి కిరణ్ రాయల్