తిరుపతిలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. నగర శివారులోని తుమ్మలగుంటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న 17ఏళ్ల విద్యార్థిని... వసతి గృహంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని కళశాల నిర్వహకులు తెలిపారు.
వసతి గృహంలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద మృతి - tirupathi crime news
ఇంటర్ విద్యార్థిని వసతి గృహంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. గొంతుపై ఎటువంటి గాయాలు లేవని విద్యార్థిని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గొంతుపై ఉరి వేసుకున్నట్లు ఎటువంటి గుర్తులు లేవని.. మొహంపై గాయాలు ఉన్నాయని విద్యార్థి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఉరి వేసుకుందని ఓసారి .. ఫిట్స్ వచ్చిందని మరోసారి కళాశాల నిర్వాహకులు చెబుతున్నారంటూ ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విద్యార్థినికి ఎటువంటి సమస్యలు లేవని.. శ్రీరామనవమికి ఇంటికి వస్తానని ఫోన్లో చెప్పిందని పోలీస్ స్టేషన్ ఎదుట మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎమ్మార్ పల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు.
ఇదీ చదవండి:గోడ కూలి ఐదో తరగతి విద్యార్థి మృతి