ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HP CM Visits Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ సీఎం - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ సీఎం...

HP CM Visits Tirumala : తిరుమల శ్రీవారిని, శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి వారిని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఈ ఉదయం స్వామి వారిని దర్శించుకున్నారు.

HP CM Visits Tirumala
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ సీఎం...

By

Published : Feb 16, 2022, 9:48 AM IST

Updated : Feb 16, 2022, 6:18 PM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ సీఎం...

HP CM Visits Tirumala : తిరుమల శ్రీవారిని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి చేరుకున్న ఠాకూర్​కు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా.. తితిదే ఛైర్మన్‌, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కలసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో..

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి వారిని హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాగూర్ దర్శించుకున్నారు. రాష్ట్ర భాజపా నేతలు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీమేధో గురు దక్షిణామూర్తి సన్నిధిలో.. హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రికి.. ఆలయం తరఫున తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికలను అందజేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని దేవున్ని ప్రార్థించినట్లు.. జైరామ్ ఠాగూర్ తెలిపారు.

ఇదీ చదవండి :

TTD TICKETS: నేటి నుంచి ఉదయాస్తమాన సేవాటికెట్ల మంజూరు

Last Updated : Feb 16, 2022, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details