తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితుల నియామకం విషయంలో చట్ట సవరణ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోరింది. ఆ వాదనపై పిటిషనర్ల తరపు న్యాయవాదులు పీవీజీ ఉమేశ్ చంద్ర , బాలాజీ వడేరా అభ్యంతరం తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి ఇప్పటికే జీవోలిచ్చి.... ఇప్పుడు చట్ట సవరణ చేస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.
తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామకం విషయంలో చట్ట సవరణ
తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామకం విషయంలో ప్రభుత్వం చట్ట సవరణ చేయనుంది. ఈ విషయాన్ని విచారణలో హైకోర్టుకు తెలిపింది.
దేవాదాయ చట్టంలో ప్రత్యేక ఆహ్వానితుల ప్రస్తావనే లేదన్నారు. ఇప్పటికే తితిదే బోర్డు సభ్యులుగా 29 మంది ఉన్నారన్నారు. సవరణ చేయడం కూడా చట్ట విరుద్దమేన్నారు. ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అనుబంధ పిటిషన్ వేయగా...కోర్టు భూమనను నాలుగో ప్రతివాదిగా చేర్చింది . ప్రధాన వ్యాజ్యంలోనూ కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని, తితిదే ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం విచారణను ఫిబ్రవరి 15 కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: Gudivada incident: తెదేపా నేతలు ఉద్రిక్త వాతావరణం సృష్టించారు: డీఐజీ మోహన్‌రావు