తిరుపతికి చెందిన హాసినీ చనిపోయిందన్న వార్త విని ఆమె తల్లి మధులత గుండెలు అవిసేలా రోదిస్తుండగా... చిన్నారి తండ్రి సుబ్రహ్మణ్యం ఆచూకీ ఇప్పటికి తెలియలేదు. ఈ పరిస్థితుల్లో హాసినీ చదువుకుంటున్న తిరుపతి స్ప్రింగ్ డేల్ పాఠశాలలో సహచర విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. గల్లంతైన సమాచారం తెలిసినప్పటికి హాసినీ... తన తండ్రితో క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థించిన తోటి విద్యార్థులంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
శోకసంద్రంలో మునిగిన హాసినీ స్నేహితులు - hasini tirupati boat accident
చెరగని చిరునవ్వుతో.....తిరిగి వస్తుందనుకున్న చిన్నారి హాసినీ పాపికొండల పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటంతో తిరుపతిలో పెనువిషాదం నెలకొంది.
తిరుపతి బోటు ప్రమాదం హాసిని