సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై తితిదే ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా పవన, సౌర విద్యుత్తు వినియోగాన్ని మరింతగా పెంచాలని యోచిస్తోంది. ఒకటిన్నర దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన పవన విద్యుత్తు పరికరాలను బాగు చేయటంతోపాటు నిర్వహణ బాధ్యతను చూసుకునేందుకు గ్రీన్‌కో అనే సంస్థ ప్రాథమికంగా సుముఖత వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. తిరుమలలో ఏడాదికి 450 లక్షల యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తున్నారు. గతంలో పవన విద్యుత్తు నుంచి 33%, ఏపీఎస్పీడీసీఎల్ నుంచి 67% వాడుకునేవారు. గతేడాది ఆగస్టు నుంచి పవన విద్యుత్తు లేకపోవడంతో ఏపీఎస్పీడీసీఎల్ నుంచే కొంటున్నారు. వాస్తవానికి 16 ఏళ్ల క్రితం 7.5 మెగావాట్ల సామర్థ్యంతో గాలిమరలను ఏర్పాటు చేశారు. ఇప్పుడవి పనికిరాని స్థితికి చేరాయి. ఈ తరుణంలో గ్రీన్‌కో సంస్థ వీటి బాధ్యతలు తీసుకునేందుకు సుముఖత వ్యక్తంచేసింది. ఇటీవల సంస్థ సాంకేతిక బృందం తిరుమలలోని ఆయా యంత్రాలను పరిశీలించినట్లు అధికారులు చెబుతున్నారు. నిర్వహణ బాధ్యతలు చూస్తూ తితిదేకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేసేందుకు ఆ సంస్థ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
* తిరుమలలో సౌర విద్యుత్తును కూడా వినియోగించుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా ధర్మగిరిలో 5 మెగావాట్లు, అతిథి గృహాలపై మరో 1.5 మెగావాట్ల ఫలకలను ఏర్పాటు చేయనున్నారు. దీనిపై నెడ్‌క్యాప్, ఏపీఎస్పీడీసీఎల్ నుంచి ప్రతిపాదనలు తీసుకున్నారు. గ్రీన్‌కో కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
‘గ్రీన్‌కో’కు తితిదే పవన విద్యుత్తు బాధ్యతలు! - తితిదే తాజా సమాచారం
సంప్రదాయేతర ఇంధన వనరుల నిర్వహణ బాధ్యతను తితిదే గ్రీన్‌కో సంస్థకు అప్పగించనుంది. ప్రసుత్తం ఉన్న పవన విద్యుత్తు పరికరాలను బాగు చేయటంతో పాటు.. సౌర విద్యుత్తును కూడా వినియోగంలోకి తీసుకు రానున్నారు.
‘గ్రీన్‌కో’కు తితిదే పవన విద్యుత్తు బాధ్యతలు!