ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తుడా పరిధిలోకి ఒక మున్సిపాలిటీ సహా 13 మండలాలు - TUDA latest news

తుడా పరిధిలోకి ఒక మున్సిపాలిటీ సహా 13 మండలాలను కలుపుతూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి కొత్తగా వచ్చి చేరగా.. 4472 చదరపు కిలోమీటర్లకు తుడా పరిధి పెరిగినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Government Release orders to Extent TUDA area
తుడా పరిధిలోకి ఒక మున్సిపాలిటీ సహా 13 మండలాలు

By

Published : Oct 21, 2020, 3:50 PM IST

తిరుపతి అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ పరిధిలోకి ఒక మున్సిపాలిటీ సహా 13 మండలాలను కలుపుతూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరి మున్సిపాలిటీ సహా మరో 13 మండలాలను తుడాలో విలీనం చేస్తూ పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. తుడా పరిధిలోకి కొత్తగా 3260 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలుపుతూ ఆదేశాలు ఇచ్చింది.

వరదయపాలెం, సత్యవేడు మండలాల్లో విస్తరించిన శ్రీసిటీ సెజ్ ఉన్న11 గ్రామాలను మినహాయిస్తూ... ఉత్తర్వులు వెలువడ్డాయి. శ్రీసిటీ సెజ్ ప్రస్తుతం నెల్లూరు అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నందున... తుడా నుంచి మినహాయించారు. నగరి మున్సిపాలిటీ సహా 13 మండలాలు కొత్తగా వచ్చి చేరటంతో 4472 చదరపు కిలోమీటర్లకు తుడా పరిధి పెరిగినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details