ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Srikalahasti: శ్రీకాళహస్తిశ్వరాలయంలో బంగారు నాగపడగలు - Golden Cobra Hood in Srikalahasti Temple

Srikalahasti Temple: శ్రీకాళహస్తిశ్వరాలయంలో బంగారు నాగపడగలను తయారు చేయించనున్నారు. విజయదశమి వరకు ఈ పడగలను అందుబాటులోకి తీసుకువచ్చి.. వాటి ద్వారా భక్తులకు సర్పదోషనివారణ పూజలు చేయనున్నారు.

శ్రీకాళహస్తీశ్వరాలయం
శ్రీకాళహస్తీశ్వరాలయం

By

Published : Aug 30, 2022, 4:11 PM IST

Golden Cobra Hood in Srikalahasti Temple: శ్రీకాళహస్తిశ్వరాలయంలో బంగారు నాగపడగల తయారీకి పాలకమండలి తీర్మానించింది. పాలకమండలి సమావేశంలో శివతత్వం పెంపొందించేందుకు శ్రీకారం చుట్టారు. భద్రత గదిలో నిల్వ ఉన్న బంగారాన్ని కరిగించి బంగారు నాగపడగలు తయారు చేయించి.. విజయదశమి నుంచి రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ప్రారంభించనున్నట్లు ఆలయ ఛైర్మన్ తారక శ్రీనివాసులు తెలిపారు. కానుకల ద్వారా భక్తులు సమర్పించిన బంగారాన్ని నాగపడగల తయారీకి వినియోగించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న శివాలయాలను 5లక్షల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అనుబంధ ఆలయాలకు మహా కుంభాభిషేకాలు, రాహు కేతు మండపాలలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని తీర్మానించారన్నారు.

ABOUT THE AUTHOR

...view details