fire accident at tirumala: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని వినాయక ఆలయానికి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో ఇవాళ సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక శాఖకు చెందిన అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని అటవీ ప్రాంతంలో.. అగ్ని ప్రమాదం - tirupati
fire accident at tirumala : తిరుమల అడవుల్లో అగ్రి ప్రమాదం సంభవించింది. మొదటి ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని అటవీ ప్రాంతంలో.. అగ్ని ప్రమాదం
మొదటి ఘాట్ రోడ్డును ఆనుకొని కపిల తీర్థంపైన ఉన్న అడవుల్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక, అటవీశాఖ సిబ్బంది.. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. సుమారు 4 నుంచి 5ఎకరాల విస్తీర్ణంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలిపారు.